Iran | ఇరాన్ (Iran) అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ఆర్మీ ప్రతినిధి (Iran Army spokesperson) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరిక చేశారు. తమపై జరిపిన దురాక్రమణకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.
‘ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసింది. దాని ఫలితం అనుభవించక తప్పదు. అమెరికాపై మరింత శక్తిమంతమైన చర్యలకు పాల్పడతాం. మా దేశంపై చేసిన దాడికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ట్రంప్.. యుద్ధం ప్రారంభించింది మీరే కావొచ్చు. కానీ దాన్ని ముగించేది మాత్రం మేమే. మా దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికాపై దాడికి సిద్ధమవుతున్నాయి’ అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి ప్రకటించారు.
అమెరికా భీకర దాడి..
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు, ఏడు బీ-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించిన స్టెల్త్ బాంబర్లు రెండు అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను జారవిడువగా, మరో అణు కేంద్రంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. బంకర్ బస్టర్ బాంబులు భూగర్భంలోని బంకర్లలోకి చొచ్చుకుపోయి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి.
Also Read..
Iran-Israel | అమెరికా నగరాల్లో ఇరాన్‌కు మద్దతుగా నిరసనలు.. VIDEO