వాషింగ్టన్ : ముగ్గురు ప్రపంచ నేతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాలో జరిగిన అతిపెద్ద కవాతుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ హాజరయ్యారు. వారు కవాతులో పాల్గొంటున్న వేళ.. ముగ్గురూ కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు.
‘మీరు అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నందున దయచేసి పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయండి’ అంటూ సోషల్ మీడియాలో రాశారు.