వర్సిటీల్లో సర్టిఫికెట్ల బ్లాక్‌మెయిలింగ్ దందా
నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రా ష్ట్రంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి విద్యార్థులతో సర్కార్ చెలగాటం
- యూజీసీ, హైకోర్టు నిబంధనలను కాలరాసి కళాశాలల అక్రమ వసూళ్లు
- ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరిక
హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రా ష్ట్రంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, కోఠి ఉమెన్స్ కళాశాల, సైఫాబాద్ సైన్స్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు త మ సంస్థలను ప్రైవేట్ ఎస్టేట్లుగా మార్చుకున్నారని వి మర్శించారు. కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల టీసీలు, ప్రొవిజనల్, మార్కుల మెమోలను అడ్డుపెట్టి బలవంతపు వసూళ్ల కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాబట్టుకోలేక, ఆ కక్షను విద్యార్థులపై చూప డం దారుణమని మండిపడ్డారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలను క ళాశాలల యాజమాన్యాలు తుంగలో తొకుతున్నాయ ని దాసోజు ఎండగట్టారు. బకాయిల నెపంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకోవడం లేదా నిలిపివేయడం నేరమని, ఇది ప్రాథమిక హకుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టంచేశారు. సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు పీజీ, పీహెచ్ డీ ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశాలపై ఇప్పటికే గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లను ఇప్పించాలని, లేకపోతే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిమాండ్లు
1. బకాయిలతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ, అటానమస్ కళాశాలల్లో నిలిపివేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంటనే అందజేసేలా విద్యాశాఖ సర్యులర్ జారీ చేయాలి.
2. నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులను భయపెడుతున్న ప్రిన్సిపాళ్లపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
3. వేలాది కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు స్పష్టమైన కాలపరిమితితో షెడ్యూల్ ప్రకటించాలి.
4. వేధింపులను ఎదురొంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఫిర్యాదుల పరిషార వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

