హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ : జెన్ జీల తరహాలో ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు దక్కుతాయని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. వచ్చేనెల 7న బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కాచిగూడలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల నేతల సంయుక్త సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుకు ఆన్లైన్ వేదికగా తెరలేపిన కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, లేదంటే పార్లమెంట్ ముట్టడికి బీసీలు సిద్ధం కావాలన్నారు.
జాతీయ ఓబీసీ మహాసభకు బీసీ విద్యార్థులు, యువజనలు, మహిళలు, ఉద్యోగులు, మే ధావులు బెంగళూరు బాట పట్టాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. దేశం లో అసమానతలు, కుల వివక్ష ఉ న్నంతకాలం సామాజిక రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీ నివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ మ హాసభకు బీసీలు వేలాదిగా తరలిరావాలని కోరారు. సమావేశంలో మై నింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు ఈరావత్ అనిల్‌కుమార్, పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలంయాదవ్, బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్, బీసీ నేతలు విక్రమ్‌గౌడ్, శ్యామ్కుర్మా, సదానందం, శ్రీనివాస్, జగన్నాథం, శివకుమార్, తారకేశ్వరి, ఉదయనేత, బ్రహ్మచారి, నరసింహచారి, కరుణశ్రీ పాల్గొన్నారు.