మాస్కో : ఉక్రెయిన్‌పై మాస్కో దమనకాండను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సమర్ధించారు. ఉక్రెయిన్‌పై సాయుధ దాడికి పుతిన్ ఆదేశించి దాదాపు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డారు. యుద్దానికి పాశ్చాత్య దేశాల నేతలే కారణమని మండిపడ్డారు. పాశ్చాత్య ప్రపంచం యుద్ధాన్ని ప్రేరేపించగా దాన్ని నిరోధించేందుకు రష్యా బలప్రయోగానికి దిగిందని పుతిన్ చెప్పుకొచ్చారు.
ఫెడరల్ అసెంబ్లీ ఎదుట పుతిన్ మంగళవారం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో మనకెదురయ్యే టాస్క్‌లను సమర్ధవంతంగా నిలకడగా రష్యా పరిష్కరిస్తుందని అన్నారు. శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారం సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామని చెప్పారు. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండను పుతిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్‌గా పిలవడం గమనార్హం.
రష్యాపై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారని, యుద్ధంలో సైనికులను కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధను తాను అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో రష్యాను ఓడించలేమనే వాస్తవాన్ని పాశ్చాత్య దేశాలు అంగీకరించలేవని అన్నారు. రష్యాను యుద్ధభూమిలో ఓడించలేమనే పశ్చిమ దేశాలు సమాచార యుద్ధానికి తెరలేపాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లోని స్థానిక సంఘర్షణను ప్రపంచ నియంత్రణ కిందకు తీసుకురావాలని కోరుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు.
Read More :
Joe Biden: వాషింగ్టన్ టు కీవ్.. బైడెన్ రహస్య జర్నీ సాగింది ఇలా
Ukraine | రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఎవరు తగ్గుతారో! ఎవరు నెగ్గుతారో