సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 12:03:21

వియన్నా ఉగ్రదాడిపై ప్రధాని దిగ్భ్రాంతి

వియన్నా ఉగ్రదాడిపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : వియన్నా ఉగ్రదాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దాడిలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపత్కాలంలో ఆస్ట్రియాకు భారత్‌ అండగా నిలుస్తుందంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. సోమవారం ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. న‌గ‌రంలోని ఆరు ప్రాంతాల్లో దుండ‌గులు రైఫిళ్లతో ఫైరింగ్ జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు. ఇది ఉగ్రదాడి అని, ఓ సాయుధుడిని మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ సెబాస్టియ‌న్ కుర్జ్ తెలిపారు. మ‌రో సాయుధుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్లు హోంశాఖ మంత్రి తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.