Donald Trump | సూటు, బూటు వేసుకొని దర్జాగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన క్రైస్తవ మతపెద్ద ‘పోప్’ అవతారమెత్తారు (President new avatar). ఇందుకు సంబంధించిన ఫొటోను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటోను ఏఐ ద్వారా రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ట్రంప్ పోప్ దుస్తులు ధరించి కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పోప్ ట్రంప్’ (Pope Trump) ఫొటో తెగ వైరల్ అవుతోంది.
క్యాథలిక్ క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ టీవీ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను పోప్ కావాలనుకుంటున్నానని, అదే తన నెంబర్ వన్ ఛాయిస్ అంటూ జోక్ వేశారు. అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ‘పోప్ ట్రంప్’ ఫొటో బయటకు వచ్చింది. ఈ పొటోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ట్రంప్ అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
— The White House (@WhiteHouse) May 3, 2025
ఏప్రిల్ 26వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ వారుసుడిని మే 7వ తేదీన ప్రారంభంకానున్న కాంక్లేవ్‌లో ఎన్నుకుంటారు. ఫ్రాన్సిస్ స్థానంలో ఎవర్ని ఎన్నుకుంటారని ట్రంప్‌ను అడగ్గా.. దానికి ఆయన బదులిస్తూ తనకు ఎటువంటి ప్రిఫరెన్స్ లేదని, కానీ కార్డినల్స్ మీటింగ్ జరుగుతోందని,న్యూయార్క్ కార్డినల్ కూడా రేసులో ఉన్నట్లు చెప్పారు. కానీ న్యూయార్క్ కార్డినల్ తిమోదీ డోలన్ ఫ్రంట్ రన్నర్ జాబితాలో లేరని ఓ మీడియా కథనం పేర్కొన్నది.
Also Read..
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం
X Account Blocked | భారత్‌లో పాక్ సమాచార మంత్రి ఎక్స్ ఖాతా బ్లాక్
America | విమానమెక్కాలంటే రియల్ ఐడీ చూపించాల్సిందే.. గ్రీన్‌కార్డుదారులకు అమెరికా ఆదేశాలు