PM Modi | నేపాల్ నూతన ప్రధాని (Nepal Prime Minister) కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)కి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా మోదీ ఓ పోస్ట్ పెట్టారు. నేపాల్ ప్రధాన మంత్రిగా నియమితులైన ఓలీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మూడోసారి నియమితులయ్యారు. నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఓలి, అతని మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఓలి గతంలో 2015-16, 2018-2021 కాలంలో ప్రధానిగా పనిచేయగా, ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టనున్నారు. అస్థిరతకు మారుపేరైన నేపాల్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఓలి ముందున్న అతిపెద్ద సవాల్.
Also Read..
Radhika Merchant | మంగల్ ఉత్సవ్‌లో బంగారు దుస్తుల్లో మెరిసిన రాధికా మర్చెంట్.. ఫొటోలు వైరల్
Food Deliveries | కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో.. ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు
Nita Ambani | మీడియాకు క్షమాపణలు చెప్పి.. నేటి వేడుకలకు అతిథులుగా ఆహ్వానించిన నీతా అంబానీ