Nita Ambani | మీడియాకు క్షమాపణలు చెప్పి.. నేటి వేడుకలకు అతిథులుగా ఆహ్వానించిన నీతా అంబానీ
Nita Ambani | నీతా అంబానీ (Nita Ambani) మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు (thanks to media) తెలియజేశారు. అనంత్- రాధిక పెళ్లి సమయంలో మీడియా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Nita Ambani | అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్‌తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 12న ‘శుభ్ వివాహ్’తో మొదలైన ఈ వేడుకలు 13వ తేదీన ‘శుభ్ ఆశీర్వాద్’, 14వ తేదీన ‘మంగల్ ఉత్సవ్’తో గ్రాండ్‌గా ముగిశాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ వేడుకలను దేశంతోపాటు విదేశీ మీడియా కూడా పెద్ద ఎత్తున కవర్ చేసింది.
ఈ నేపథ్యంలో వేడుకల చివరిరోజైన నిన్న ‘మంగళ ఉత్సవ్’ కార్యక్రమంలో నీతా అంబానీ (Nita Ambani) మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు (thanks to media) తెలియజేశారు. అనంత్- రాధిక పెళ్లి సమయంలో మీడియా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు.
‘అనంత్ – రాధిక పెళ్లికి మీరంతా వచ్చి వేడుకల్లో భాగమయ్యారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకల్లో ఏదైనా అనుకోకుండా తప్పులు జరిగి ఉంటే అందుకు క్షమించండి. పెళ్లి ఇంట్లో పొరపాట్లు జరగడం సాధారణమే. మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. అదేవిధంగా ఇవాళ జరిగే వేడుకలకు మీడియా మిత్రులను నీతా అంబానీ అతిథులుగా ఆహ్వానించారు. ‘మీరు రేపు మా అతిథులుగా రండి. మీ అందరికీ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. మరోసారి అందరికీ ధన్యవాదాలు’ అని నీతా అంబానీ పేర్కొన్నారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో జాతీయ అంతర్జాతయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, ఇతర దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.
Also Read..
U-Win Portal | ఆగస్టునాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్ పోర్టల్
Charmadi Waterfalls | పర్యాటకుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎందుకో తెలుసా?
Karnataka | కర్ణాటకలో బస్సు చార్జీల మోత.. సామాన్య ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ మరో భారం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

