Charmadi Waterfalls | బెంగళూరు, జూలై 14: టూరిస్టు ప్రదేశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను చాలామంది పర్యాటకులు పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా వర్షాకాలంలో జలపాతాల కింద స్నానం చేస్తున్న కొందరు పర్యాటకులకు పోలీసులు విధించిన చిన్నపాటి శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కర్ణాటక ముడిగేరిలోని చార్మడి జలపాతం వద్ద స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొందరు స్నానాలు చేయడంతో వారు జలపాతం దిగువన ఉంచిన దుస్తులను పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో పర్యాటకులు తమ బట్టలు ఇచ్చేయాలంటూ అర్ధనగ్నంగా పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పర్యాటకులను హెచ్చరించిన అనంతరం పోలీసులు వారి బట్టలు ఇచ్చేశారు.