Radhika Merchant | ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం (Wedding) తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చెంట్ (Radhika Merchant)తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 12న ‘శుభ్ వివాహ్’తో మొదలైన ఈ వేడుకలు 13వ తేదీన ‘శుభ్ ఆశీర్వాద్’, 14వ తేదీన ‘మంగల్ ఉత్సవ్’తో గ్రాండ్‌గా ముగిశాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో వధువు రాధికా మర్చెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకకు తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. అంబానీ రేంజ్‌కు తగ్గట్టే రెడీ అయ్యి ఔరా అనిపించింది.
సందర్భానికి తగినట్లుగా రెడీ అవ్వడం రాధికకు వెన్నతో పెట్టిన విద్య. పండుగలు, పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. పార్టీలు, ఇతర అకేషన్లలో మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది. ఇక జీవితాంతం గుర్తుండిపోయే తన వివాహ వేడుకలో మరింత అందంగా ముస్తాబై అందరినీ కట్టిపడేసింది. ఆదివారం రాత్రి జరిగిన ‘మంగల్ ఉత్సవ్’ కార్యక్రమంలో రాధిక బంగారు దుస్తుల్లో (gold outfit) మెరిసిపోయి వావ్ అనిపించింది. అనామిక ఖన్నా , ఇటాలియన్ డిజైనర్ డోల్స్ అండ్ గబ్బానా ఈ డ్రెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం రాధిక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో జాతీయ అంతర్జాతయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, ఇతర దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.
Also Read..
Nita Ambani | మీడియాకు క్షమాపణలు చెప్పి.. నేటి వేడుకలకు అతిథులుగా ఆహ్వానించిన నీతా అంబానీ
Food Deliveries | కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో.. ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు
KTR | ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్