Food Deliveries | కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో.. ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు
Food Deliveries | ప్రముఖ ఫుడ్ డెలివరీ (Food Deliveries) యాప్స్ జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) తమ కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్ఫామ్ ఫీజును (Platform Fee) ఏకంగా 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Food Deliveries | ప్రముఖ ఫుడ్ డెలివరీ (Food Deliveries) యాప్స్ జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) తమ కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్ఫామ్ ఫీజును (Platform Fee) ఏకంగా 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ, బెంగళూరు వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో, ఇకపై ప్లాట్ఫామ్ ఫీజు రూ.6 వసూలు చేయనున్నట్లు తెలిపాయి. ఇప్పటి వరకూ ఈ ఫీజు రూ.5గా ఉంది. అయితే స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్ఫామ్ ఫీజును రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6కు తగ్గించినట్లు తెలిపింది.
గతంలో కూడా జొమాటో, స్విగ్గీ సంస్థలు తమ ప్లాట్ఫాం ఫీజును పెంచాయి. 2023 ఆగస్టులో ఈ తరహా ఫీజును తొలిసారి ప్రారంభించాయి. మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వస్తున్నాయి. ఏప్రిల్లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్నవూ నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది. ఇక వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది.
ఒక్కో ఆర్డరపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్లు ఈ తరహా ఫీజులకు తెరలేపాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ రెండు సంస్థలదే పైచేయి కావడంతో.. ఆదాయంతోపాటు లాభాలను కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ ఫీజు పెంచడం ద్వారా రోజుకు రూ.1.25 నుంచి రూ.1.5 కోట్ల వరకూ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే ప్లాట్ఫామ్ ఫీజులను పెంచి కస్టమర్లకు షాకిస్తున్నాయి.
ఇక, జొమాటో, స్విగ్గీలకు చెందిన క్విక్ కామర్స్ వేదికలైన బ్లింకిట్, ఇన్స్టామార్ట్లు కూడా హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్పై రూ.4, ఇన్స్టామార్ట్ రూ.5 వరకు వసూలు చేస్తున్నాయి. దేశరాజధాని నగరమైన దిల్లీలో ఈ ఛార్జీలు వరుసగా రూ.16, రూ.5గా ఉన్నాయి.
Also Read..
bus collides with truck | ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
Nita Ambani | మీడియాకు క్షమాపణలు చెప్పి.. నేటి వేడుకలకు అతిథులుగా ఆహ్వానించిన నీతా అంబానీ
U-Win Portal | ఆగస్టునాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్ పోర్టల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

