Indonesia | ఇండోనేషియా (Indonesia)లో పెను ప్రమాదం తప్పింది. ఓ విమానం అదుపుతప్పి రన్‌వేపై జారింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.
త్రిగానా ఎయిర్ (Trigana Air)కు చెందిన ఏటీఆర్-42 విమానం సోమవారం పపువా (Papua) రీజియన్ యాపిన్ ద్వీపం (remote Yapen Islands regency) నుంచి రాజధాని జయపురకు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా అదుపుతప్పి రన్‌వేపై స్కిడ్ అయ్యింది. సమీపంలోని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో ఓ పాపతో సహా 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
అయితే, అదృష్టవశాత్తూ వారంతా గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని వారందరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి యూకీ తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Hari ini:
Trigana Air ATR42-509 PKYSP tergelincir saat lepas landas di Serui menuju Jayapura.42 penumpang dengan 6 crew selamat dan info sementara tidak ada yang cedera. pic.twitter.com/pLEUp9YyFu
— Gerry Soejatman (@GerryS) September 9, 2024
కాగా, ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డును ఇండోనేషియా మూటగట్టుకుంది. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి విపత్తులు కారణంగా తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటా ప్రకారం.. 1945 నుంచి ఇప్పటి వరకూ వందకు పైగా ప్రమాదాలు జరిగాయి. అందులో సుమారుగా 1300 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2015లో త్రిగానా ఎయిర్‌కు చెందిన విమానం కూలిపోవడంతో అందులో ఉన్న 54 మంది మరణించారు.
Also Read..
AAP | కాంగ్రెస్‌తో తేలని పొత్తు.. హర్యానా ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన ఆప్
Sachin Tendulkar | ఇంట్లోనే గణపయ్య నిమజ్జనం.. సచిన్ భావోద్వేగ పోస్ట్