Pig kidney | అవయవ మార్పిడి విధానంలో ముందడుగు.. మనిషి శరీరంలో 2 నెలలు సక్రమంగా పనిచేసిన పంది కిడ్నీ
Pig kidney | వైద్య చరిత్రలోనే అవయవ మార్పిడి విధానంలో పెద్ద ముందడుగు పడింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీ (Pig kidney)ని అమర్చగా.. అది రెండు నెలల పాటు సక్రమంగా పనిచేసింది.
Pig kidney | మనిషి శరీరంలో ఏదైనా అవయవం పనిచేయకపోతే.. వేరే వ్యక్తుల అవయవాన్ని అమరుస్తుంటారు. కుటుంబ సభ్యులు, లేదా ఇతర వ్యక్తులు తమ అవయవాలను దానం చేస్తే వాటిని అవసరమైన రోగులకు అమరుస్తుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ అవయవాలు దొరకవు. అదృష్టవశాత్తూ దొరికినా రోగి శరీరానికి సరిపోవు. ఈ క్రమంలోనే చాలా మంది జీవితం అర్ధంతరంగా ఆగిపోతుంటుంది. దీంతో అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీ (Pig kidney)ని మానవ శరీరానికి (human body) అమర్చారు. అది ఇప్పుడు సత్ఫలితాన్నిచ్చింది.
అమెరికా (USA)లో బ్రెయిన్‌డెడ్ (Brain-Dead) అయిన వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా అది ఎన్నడూ లేని విధంగా ఏకంగా రెండు నెలలపాటు సక్రమంగా పనిచేసింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి అమెరికా వైద్యులు జులై 14వ తేదీన జన్యుమార్పిడి చేసిన పందికిడ్నీని విజయవంతంగా అమర్చారు. నెల రోజులకుపైగా ఆ మూత్రపిండం మనిషి శరీరంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పనిచేసింది. అయితే, ఆ తర్వాత కిడ్నీ ఉత్పత్తి చేసే మూత్ర పరిణామం తగ్గడంతో.. వైద్యులు రోగనిరోధన ఔషధాలతో దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. రెండు నెలల అనంతరం అంటే బుధవారం నాడు ఆ కిడ్నీని మనిషి శరీరం నుంచి తొలగించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన పంది మూత్రపిండం మనిషి శరీరంలో గతంలో కంటే ఎక్కువ రోజులు పనిచేయటం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగంతో వైద్య చరిత్రలోనే అవయవ మార్పిడి విధానంలో పెద్ద ముందడుగు పడినట్లైంది.
ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో బతికున్న వ్యక్తులపై కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కాగా, గతేడాది మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు.. చనిపోతున్న ఓ వ్యక్తికి పంది గుండెతో కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అతను రెండునెలలు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. ఆ తర్వాత పంది గుండె విఫలం కావటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Also Read..
Deepika Padukone | అవన్నీ అవాస్తవాలే.. జవాన్ రెమ్యూనరేషన్పై దీపిక క్లారిటీ
MS Dhoni | యువ క్రికెటర్‌కు తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

