Infosys | వరల్డ్ 100 బెస్ట్ కంపెనీస్ లిస్ట్‌లో ఇన్ఫోసిస్.. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఐటీ సంస్థ
Infosys | దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో (Worlds 100 Best Companies) చోటు దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైన ఐటీ కంపెనీగా నిలిచింది.
Infosys | దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో (Worlds 100 Best Companies) చోటు దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైన ఐటీ కంపెనీగా నిలిచింది. 2023లో ప్రపంచంలోనే వంద అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ (TIME Magazine) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానానాల్లో ఆల్ఫాబెట్ (గూగుల్), మెటా (ఫేస్బుక్) కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కావడం విశేషం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న 750 కంపెనీల జాబితాను టైమ్స్ తాజాగా విడుదల చేసింది. రెవెన్యూ గ్రోత్, సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ మొదలగు అంశాల ఆధారంగా కంపెనీల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇన్ఫోసిస్‌తోపాటు మరో 7 భారతీయ కంపెనీలు టాప్ 750లో చోటు దక్కించుకున్నాయి. విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి.
Also Read..
Deepika Padukone | అవన్నీ అవాస్తవాలే.. జవాన్ రెమ్యూనరేషన్పై దీపిక క్లారిటీ
Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
Manipur Violence | 175 మంది మృతి.. మార్చురీలో 96 మృతదేహాలు.. మణిపూర్ హింసపై పోలీసు డేటా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

