Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
Nuh violence | హర్యానా (Haryana)లోని నుహ్ (Nuh) జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) మమ్మన్ ఖాన్ (Mamman Khan)ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
Nuh violence | హర్యానా (Haryana)లోని నుహ్ (Nuh) జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) మమ్మన్ ఖాన్ (Mamman Khan)ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. జులై 31న హిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర అనంతరం చెలరేగిన హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని హర్యానా పోలీసులు (Haryana Police) తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లు ఫిరోజ్‌పూర్ జిర్కా ( Ferozepur Jhirka) డీఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.
అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అంతకుముందు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు నుహ్ పోలీసులు రెండుసార్లు సమన్లు పంపారు. అయితే, ఆయన ఇతర కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మమ్మన్ ఖాన్ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ జిర్కా ( Ferozepur Jhirka) అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన అరెస్ట్‌ను ముందే ఊహించిన మమ్మన్ ఖాన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పంజాబ్- హర్యానా హైకోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హింస చెలరేగిన రోజున తాను నుహ్‌లో లేనని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మమ్మన్ ఖాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 19న జరగనుంది.
జులై 31వ తేదీన వీహెచ్‌పీ (Vishva Hindu Parishad) మత ఊరేగింపు సందర్భంగా నూహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. గుర్‌గ్రామ్‌లోని బాద్షాపూర్లో ఓ రెస్టారెంట్‌తో పాటు 14 దుకాణాలను ధ్వంసం చేశారు. సెక్టార్ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పుపెట్టారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దాదాపు 200 మందితో కూడిన గుంపు ప్రధానంగా బిర్యానీ అమ్మే దుకాణాలు, ఇతర ఫుడ్‌స్టాళ్లపై దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 100 మందికిపైనే అరెస్ట్ చేశారు.
Also Read..
Nipah virus | కేరళలో మరొకరికి నిఫా వైరస్.. 6కు పెరిగిన పాజిటివ్ కేసులు
Heavy Rain | తడిసి ముద్దైన దేశ రాజధాని ఢిల్లీ
Private Jet Skids Off Runway | రన్‌వేపై జారిన విమానం.. 8 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

