Nipah virus | కేరళలో మరొకరికి నిఫా వైరస్.. ఆరుకు పెరిగిన పాజిటివ్ కేసులు
Nipah virus | అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus ) కేరళ (Kerala) రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Nipah virus | అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus ) కేరళ (Kerala) రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే అందులో నిఫా కారణంగా బుధవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఫా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కోజికోడ్ (Kozhikode) జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేసింది. జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలలను, ఇతర కార్యాలయాలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ (Bangladesh variant) అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్ తెలిపారు.
మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్ఫెక్షన్ బయటపడింది. ఇక దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలోనే వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ వైరస్ నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. మొత్తం 23 మందికి ఈ వైరస్ నిర్ధారణ కాగా, అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎలా వ్యాపిస్తుంది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు, చికిత్స?
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Also Read..
Anantnag Encounter: అనంతనాగ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. నాలుగో సైనికుడు మృతి
Devil | వినాశకాలే విపరీత బుద్ధి.. సస్పెన్స్‌గా కల్యాణ్‌రామ్ డెవిల్ డైరెక్టర్ పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

