Crime news | గాఢ నిద్రలో ఉండగా కొడుకు కుటుంబానికి నిప్పుపెట్టిన తండ్రి.. ఇద్దరు సజీవ దహనం.. ఒకరి పరిస్థితి విషమం
Crime news | కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు సజీవ దహనమయ్యారు.
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు సజీవ దహనమయ్యారు. కోడలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఘటన అనంతరం విషం తాగి నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు జాన్సన్ బుధవారం అర్ధరాత్రి తన కుమారుడు జోజీ (38), కోడలు లిజీ (33), 12 ఏళ్ల మనవడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో జోజీ, అతడి కుమారుడు మృతిచెందారు. 50 శాతం కాలిన గాయాలతో లిజీ ఎర్నాకుళంలోని ఓ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
కాగా, కుమారుడి కుటుంబానికి నిప్పంటించిన తర్వాత నిందితుడు జాన్సన్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడు కూడా త్రిస్సూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాన్సన్ పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

