Anantnag Encounter: అనంతనాగ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. నాలుగో సైనికుడు మృతి
Anantnag Encounter: అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు ఇవాళ కూడా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కోకెర్నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో దళాలు మోహరించాయి. అయితే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్(Anantnag Encounter)లో భద్రతా దళాలు ఇవాళ కూడా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కోకెర్నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో దళాలు మోహరించాయి. అయితే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కోకెర్నాగ్లో ఉగ్రవాదులు దాచుకున్నట్లు వార్తలు రావడంతో.. బుధవారం నుంచి అక్కడ ఎన్కౌంటర్ మొదలైంది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఆర్మీకి చెందిన కమాండింగ్ ఆఫీసర్, కంపెనీ కమాండర్, డీఎస్పీ మృతిచెందారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్, డీఎస్పీ హుమాయున్ భట్ మృతిచెందినవారిలో ఉన్నారు. మన్‌ప్రీత్ సింగ్, ఆశిశ్ దోంచాక్ పార్దీవదేహాలను పానిపట్‌లోని స్వగ్రామానికి శుక్రవారమే చేర్చారు.
లష్కరే తోయిబాకు ప్రత్యామ్నాయం అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దళ కాల్పులకు తెగించినట్లు తెలుస్తోంది. కోకెర్నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు మొదలుపెట్టాయి. హీరన్ డ్రోన్లతో పాటు క్వాడ్కాప్టర్లను .. నిఘా కోసం రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు జరిపిన ఫైరింగ్‌లో ఓ కల్నల్ అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడి ఆ తర్వాత హాస్పిటల్లో మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

