Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తడిసి ముద్దైంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు మోకాలి లోతు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్, మునిర్కా, ఆర్కేపురం సహా పలు ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. మరోవైపు వచ్చే ఐదురోజులపాటు నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
#WATCH | Heavy rain lashes parts of Delhi NCR; Visuals from MG Road in Haryana’s Gurugram pic.twitter.com/U29ykbL7Ce
— ANI (@ANI) September 15, 2023
Also Read..
Nipah virus | కేరళలో మరొకరికి నిఫా వైరస్.. 6కు పెరిగిన పాజిటివ్ కేసులు
Tirumala | తిరుమల రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సు
Anantnag Encounter: అనంతనాగ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. నాలుగో సైనికుడు మృతి