Tirumala | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తిరుమల రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును గురువారం టీటీడీ ప్రయోగాత్మకంగాప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న నగరంగా తిరుమల చరిత్ర సృష్టించిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఏడాదిన్నర కిందట ఆటోలు తిరగడమే కష్టంగా మారిన ఇరుకైన రోడ్లను ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే స్థాయికి విస్తరించామని పేర్కొన్నారు. అదనంగా మరో 18 మాస్టర్ రోడ్లను, పెద్ద ఎత్తున ఫ్రీ లెఫ్ట్రోడ్లను నిర్మించామని భూమన వెల్లడించారు.