Deepika Padukone | జవాన్ చిత్రంతో (Jawan Movie) మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లకుపైనే కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో దీపిక రెమ్యూనరేషన్ (Jawan Remunaration) ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అతిథి పాత్రకోసమే దీపిక ఏకంగా రూ.30కోట్లు తీసుకుందంటూ బీటౌన్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ రూమర్సే అంటూ కొట్టి పారేసింది.
ఇటీవలే వచ్చిన పలు చిత్రాల్లో తాను అతిథి పాత్రలు చేసినట్లు దీపిక చెప్పింది. ‘జవాన్’తోపాటు రణ్‌వీర్‌సింగ్ ‘83’, ‘సర్కస్’ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించినట్లు తెలిపింది. ఆయా చిత్రాల కథలు నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది. జవాన్ చిత్ర కథ కూడా తనకెంతో నచ్చిందని తెలిపింది. అంతేకాకుండా.. షారుఖ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. జవాన్‌లో తన పారితోషకం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆ పాత్రకు తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసింది. ప్రస్తుతం దీపిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జవాన్ చిత్రం గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ గత రికార్డులను కూడా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ చేసేసింది.
Also Read..
Jawan Movie | నాకు బట్టతల ఉన్న అమ్మాయిలంటే ఇష్టం : షారుఖ్ ఖాన్
Actor Ajith Kumar | ఒమన్‌లో బైక్ రైడింగ్ చేస్తున్న అజిత్.. ఫొటోలు వైరల్
Dunki Movie | బిగ్ అప్డేట్.. షారుఖ్ ‘డంకీ’ చిత్రంలో మున్నాభాయ్, ఏటీఎమ్ స్పెషల్ కెమియో రోల్