Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఇక వారం రోజుల్లో రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు. షారుఖ్‌ఖాన్‌కు ఈ ఏడాది మరో వెయ్యి కోట్ల సినిమా కావడం పక్కా అని క్లారిటి వచ్చేసింది. ఇక శుక్రవారం కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి సినీ ప్రముఖులే కాకుండా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ బట్టతల(Bald Hair) లుక్ ఫుల్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లుక్‌పై షారుఖ్ స్పందించాడు.
‘జవాన్’ (Jawan) సక్సెస్ మీట్లో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌లో భాగంగానే బట్టతల లుక్‌లో కనిపించినట్లు తెలిపాడు. దీనివల్ల మేకప్ టైం కూడా తగ్గిందని అన్నాడు. అయితే ఈ లుక్ బయటకు వచ్చినప్పుడు నా స్నేహితులు ఫొన్ చేసి అరేయ్ యార్ చాలా భయంగా ఉంది, అమ్మాయిలు ఇలా నిన్ను ఇష్టపడరు అంటూ కామెంట్స్ చేశారు. కానీ నేను అవి పట్టించుకోలేదు. ఎందుకంటే అమ్మాయిలు బట్టతల ఉన్న పురుషులను ఇష్టపడతారని నేను నమ్ముతాను. నాకు కూడా బట్టతల ఉన్న అమ్మాయిలంటే ఇష్టం అంటూ షారుఖ్ చెప్పుకొచ్చాడు.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుక్ సరసన నయనతార (Nayanathara) నటించగా.. విజయ్ సేతుపతి(Vijay Sethupathy), దీపిక పదుకొణె (Deepika Padukone), ప్రియమణి (Priyamani), సునీల్ గ్రోవర్ (Suni Groover), సాన్య మల్హోత్ర (Sanya Malhotra), యోగిబాబు (Yogi babu) తదితరులు కీలకపాత్రలు పోషించారు.