Actor Ajith Kumar | ఒమన్‌లో బైక్ రైడింగ్ చేస్తున్న అజిత్.. ఫొటోలు వైరల్
Actor Ajith Kumar | తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ ‘తునివు’ (Thunivu) చిత్రంతో సందడి చేశారు. సినిమాలలో తన నటనతో అలరించే ఈ స్టార్ హీరోకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. సినిమాలకు విరామం ఇచ్చిన సమయాల్లో బైక్‌పై టూర్స్‌కు వెళ్తుంటారు. తాజాగా అజిత్ అరబ్ కంట్రీ ఓమన్‌లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.
Actor Ajith Kumar | తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ ‘తునివు’ (Thunivu) చిత్రంతో సందడి చేశారు. సినిమాలలో తన నటనతో అలరించే ఈ స్టార్ హీరోకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. సినిమాలకు విరామం ఇచ్చిన సమయాల్లో బైక్‌పై టూర్స్‌కు వెళ్తుంటారు. తాజాగా అజిత్ అరబ్ కంట్రీ ఒమన్‌లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.
అజిత్ హీరోగా చేస్తున్న తాజా ప్రాజెక్ట్ (VidaaMuyarchi). ఏకే 62 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీకి తదం (తెలుగులో రెడ్) సినిమా ఫేమ్ మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ తొలి షెడ్యూల్ అబుదాబిలో జరుగనుండగా.. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అరబ్ కంట్రీ ఒమన్(Oman)లో ఉన్న అజిత్ బైక్ రైడింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest video of Ajith sir from OMAN ! #Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/GTM5UKVcj1
— TRENDS AJITH (@TrendsAjith) September 15, 2023
A latest pic of #AK from #AbuDhabi pic.twitter.com/c9kVO6RsWS
— Ramesh Bala (@rameshlaus) September 15, 2023
ఇక ఏకే 62 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఫైనల్ అయ్యారని టాక్ నడుస్తోంది. వీరిలో త్రిష, తమన్నా పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

