Dunki Movie | బిగ్ అప్డేట్.. షారుఖ్ ‘డంకీ’ చిత్రంలో మున్నాభాయ్, ఏటీఎమ్ స్పెషల్ కెమియో రోల్
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్గా విడుదలైన ‘జవాన్’ (Jawan) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డంకీ (DUNKI).
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్గా విడుదలైన ‘జవాన్’ (Jawan) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డంకీ (DUNKI). మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). లాగేరహో మున్నాభాయ్ (Lageraho Munnabhai), త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), సంజు (Sanju) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగనికి పైగా షూటింగ్ కప్లీంట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్. లాగేరహో మున్నాభాయ్ (తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్) సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని మున్నాభాయ్, ఏటీఎమ్ (శంకర్ దాదా, ఏటీఎమ్) క్యారెక్టర్లను ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోరు. అంతలా జనాలను ఇంపాక్ట్ చేశాయి. ఇక ఈ క్యారెక్టర్లను బాలీవుడ్లో సంజయ్ దత్ (Sanjay Dutt), అర్షద్ వార్సి (Ardhad Warsi) పోషించగా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శ్రీకాంత్ (Srikanth) నటించారు. తాజాగా మున్నాభాయ్, ఏటీఎమ్‌లు మళ్లీ అలరించనున్నారు.
షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న ‘డంకీ’ లో మున్నాభాయ్, ఏటీఎమ్‌లు కెమియో రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
#MunnaBhai3 or #Dunki Cameo ??
— Christopher Kanagaraj (@Chrissuccess) September 14, 2023
ఇదిలా ఉండగా.. దీపావళి కానుకగా షారుఖ్ డంకీ సినిమా టీజర్ (Dunki Movie Teaser) ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీపావళికి విడుదల కానున్న సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై 3 (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సల్మాన్ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక సమాచారం కొరకు మరింత సమయం వేచి చూడాల్సి ఉంది.
డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

