Swiss glacier collapse | స్విట్జర్లాండ్ (Switzerland).. ప్రకృతి అందాలను నెలవు. స్విస్ పేరు వినగానే అందమైన ఆల్ప్స్ పర్వతాలు, ప్రకృతి సోయగాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే, తాజాగా అక్కడ ఘోర విపత్తు సంభవించింది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని వాలిస్ ప్రాంతంలో మంచు పతనం జరిగింది. బిలర్చ్ గ్లేసియర్ కూలిపోయింది. ఈ విపత్తు కారణంగా టన్నుల కొద్ది మంచు, రాళ్లు పర్వత శ్రేణుల నుంచి లోయలోకి దూసుకొచ్చాయి. ఈ భారీ మంచు చరియలు బ్లాటెన్ అనే చిన్న గ్రామాన్ని (Blatten village) పూర్తిగా ధ్వంసం చేశాయి.
ఈ గ్రామంలో దాదాపు 300 మంది నివసిస్తుంటారు. అయితే, విపత్తును ముందే గుర్తించిన అధికారులు వారం రోజుల ముందే గ్రామాన్ని ఖాళీ చేయించారు. స్థానికులనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రస్తుతం స్విస్ అధికారులు లోయలో వరదల ప్రమాదంపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ గ్రామం మొత్తం ఇప్పుడు బురద, మంచు దిబ్బలతో నిండిపోయింది. హిమచరియలు ఇప్పటికీ పడుతున్నాయని అధికారులు తెలిపారు. జారిపడ్డ మట్టిపెళ్లల వల్ల లోన్జా నదిలో అలజడి చెలరేగుతోందని వివరించారు. దిగువ ప్రాంతాలను నదీజలాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉడటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Also Read..
Donald Trump | మస్క్ ఓ అద్భుతం.. ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు : డొనాల్డ్ ట్రంప్
Trumps tariffs | సుంకాలపై ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు
New York | భారతీయ జంట పెండ్లి బరాత్‌తో హోరెత్తిన వాల్‌స్ట్రీట్..