ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం పెట్రో ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ ధరలను 43 శాతం, హైస్పీడ్ డీజిల్ ధరలను 50 శాతం పెంచింది. దీంతో పెట్రోల్ రేటు రూ.458.41కి చేరుకోగా, హైస్పీడ్ డీజిల్ రేటు రూ.520.35కి చేరుకుంది.
ఇక కిరోసిన ధర రూ.34 పెరిగి రూ.457.80కి చేరింది. ఇది చాలా కఠిన నిర్ణయమని, సబ్సిడీలకు అత్యంత కీలక రంగాలకు పరిమితం చేసి, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ తెలిపారు. అయితే మోటర్ సైకిళ్ల యజమానులకు మాత్రం లీటర్కు రూ.100 చొప్పున రాయితీ అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.