పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్‌పై కూడా లేరని, ఆస్పత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు ట్విట్టర్లో వెల్లడించారు.
‘‘ఆయన వెంటిలేటర్‌పై లేరు. అమిలోడోసిస్ సమస్య తీవ్రతరం కావడంతో గడిచిన మూడు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రికవరీ అసాధ్యమైన దశలో ఆయన ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అవయవాలు కూడా సరిగా పనిచేయడం లేదు. ఆయన కోసం దయచేసి ప్రార్థించండి’’ అని ముషారఫ్ కుటుంబ సభ్యులు సందేశం పంపారు.
దీంతో ఇప్పటి వరకు వచ్చిన ముషారఫ్ వార్తలకు ఫుల్స్టాప్ పడుతుందని, ఈ ఫేక్ న్యూస్ ఆపేయాలని ముషారఫ్ అభిమానులు కోరుతున్నారు.