Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో నెల రోజులకు పైగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 300 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వర్ష బీభత్సానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.
పాక్ విపత్తు నిర్వహణ సంస్థ (Pakistan National Disaster Management Authority) పంచుకున్న డేటా ప్రకారం.. జూన్ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 299 మంది మరణించారు. ఇందులో 140 మంది చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా 715 మంది గాయపడ్డారు. అందులో 239 మంది చిన్నారులు కాగా, 204 మంది మహిళలు, 272మంది పురుషులు ఉన్నారు. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,676 ఇండ్లు దెబ్బతిన్నాయి. 562 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 428 మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. రానున్న మూడు రోజులు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read..
New Zealand: లగేజీ బ్యాగులో రెండేళ్ల చిన్నారి.. 27 ఏళ్ల మహిళ అరెస్టు
USA | ఆమోదయోగ్యం కాదు.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా