Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గోల్ఫ్ రిసార్ట్ వద్ద భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. న్యూజెర్సీ (New Jersey)లో గోల్ఫ్ క్లబ్ సమీపంలో నోఫ్లైజోన్ (no-fly zone) ప్రాంతంలోకి ఓ ప్రయాణికుల విమానం (civilian plane) దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఫైటర్ జెట్స్ (Fighter jets) రంగంలోకి దిగాయి.
ఫాక్స్ న్యూస్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. బెడ్మినిస్టర్లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్ (Trumps golf club) సమీపంలో నోఫ్లైజోన్ ప్రాంతంలోకి ప్రయాణికుల విమానం ఒక్కసారిగా దూసుకొచ్చింది. విమానం రాకను గమనించిన ఫైటర్‌జెట్స్ వెంటనే రంగంలోకి దిగి ఆ విమానాన్ని అడ్డుకున్నాయి. ఓ రకమైన జ్వాలతో ప్రయాణికుల విమానం పైలట్‌ను అప్రమత్తం చేశాయి. దాన్ని నోఫ్లై జోన్ నుంచి పంపించేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ క్లబ్ రిసార్ట్‌లోనే ఉన్నారని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD)ను ఊటంకిస్తూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.
Also Read..
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు
Ceiling Collapses | పీవీఆర్ సినిమా హాల్లో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు
Shibu Soren | జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత