క్రైస్ట్‌చర్చ్ : లగేజీ బ్యాగులో రెండేళ్ల అమ్మాయిని తీసుకెళ్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన న్యూజిలాండ్(New Zealand)లో జరిగింది. ఉత్తర దిక్కున ఉన్న కైవాకా అనే పట్టణంలో ఓ బస్సు లగేజీ నుంచి పాపను రక్షించారు. ఓ ప్రయాణికుడు లగేజీ కంపార్ట్మెంట్ యాక్సెస్ కావాలని కోరగా, ఆ సమయంలో డ్రైవర్ కదులుతున్న బ్యాగ్‌ను గుర్తించాడు. అయితే సూట్‌కేసును ఓపెన్ చేసిన సమయంలో.. దాంట్లో రెండేళ్ల అమ్మాయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో 27 ఏళ్ల అమ్మాయిని అరెస్టు చేశారు. ఆమెపై కేసు బుక్ చేశారు. బ్యాగేజీలో ఉన్న ఆ పాప చాలా వేడిగా ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ అమ్మాయికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. లగేజీ తీసుకువచ్చిన మహిళ, దాంట్లో ఉన్న చిన్నారికి మధ్య రిలేషన్ ఏంటో ఇంకా తెలియలేదు. నార్త్ షోర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ మహిళను హాజరుపరిచారు. లగేజీని పసికట్టి ఆపిన డ్రైవర్‌ను పోలీసులు మెచ్చుకున్నారు.