న్యూఢిల్లీ : భారత్, అఫ్ఘానిస్థాన్‌తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్ నుంచి ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాది ఈ దాడి చేసినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ఆసిఫ్ పై వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ మాట్లాడుతూ భారత్, అఫ్ఘాన్ సరిహద్దులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని చెప్పారు. భారత్, అఫ్ఘాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే అదే రీతిలో వాటికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.