Khawaja Asif | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు చెందిన నేతల తీరు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం పాక్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు (Flash Floods) అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. రుతుపవనాల ప్రారంభం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అనేక నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన నగరాలతోపాటూ అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వరదలను వరంగా భావించాలని సూచించారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘నీటిని కాలువల్లోకి వదిలేస్తున్నాము. ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకూడదు. ఈ వరదలను ఓ వరంగా భావించి నీటిని ఇళ్లలోని టబ్‌లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి’ అంటూ సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆసిఫ్ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
జూన్ 26న పాక్‌లో రుతుపవనాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్ అంతటా దాదాపు 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికిపైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకూ దేశ వ్యాప్తంగా దాదాపు 854 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,100 మంది గాయపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. అత్యధికంగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Also Read..
TCS | ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. లేఆఫ్స్ వేళ వేతనాలు పెంచిన టీసీఎస్
PM Modi | చనిపోయిన నా తల్లిని అవమానించారు.. ఆర్జేడీ- కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్
Tesla | భారత విపణిలో టెస్లాకు నిరాశే.. ఆశించిన స్థాయిలో లేని బుకింగ్స్..!