Tesla | భారత విపణిలో టెస్లాకు నిరాశే.. ఆశించిన స్థాయిలో లేని బుకింగ్స్..!
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్ చేసింది. ఎన్నో అంచనాలతో భారత విపణిలోకి అడుగుపెట్టిన టెస్లాకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదని సమాచారం.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 600 బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువ. ఎందుకంటే టెస్లా ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. దీంతో భారత్‌లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని కంపెనీకి చెందిన కీలక వ్యక్తులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
టెస్లా భారత్‌లో ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను డెలివరీ చేయాలని ప్లాన్ చేసుకుంది. ఇందు కోసం మొదటి బ్యాచ్ షాంఘై నుంచి ఈ నెల మొదట్లో భారత్‌కు చేరుకోవచ్చని సమాచారం. ఈ వాహనాల డెలివరీలను ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, పుణే, గురుగ్రామ్ నగరాలకే పరిమితం చేయాలని కంపెనీ భావిస్తోంది. పూర్తి చెల్లింపుల తర్వాతే కార్లను డెలివరీ చేయనుంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది.
వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. టెస్లాకు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ ఎక్కువ ధర కారణంగా భారత EVమార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్నది టాక్.
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
AAP MLA | రేప్ కేసులో అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

