AAP MLA | ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్ మజ్రా (MLA Harmeet Singh)పై రేప్ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేశారు (AAP MLA arrested). అయితే, స్టేషన్కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు అడ్డుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడినట్లు తెలిసింది. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రెండు వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు (flees from custody). అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ఓ వాహనాన్ని పట్టుకున్నారు. అయితే, అందులో ఎమ్మెల్యే లేరు. వేరే వాహనంలో పారిపోయారు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ అరెస్టుకు ముందు ఫేస్బుక్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓ పాత ఘటనకు సంబంధించి తనపై రేప్ కేసు నమోదు చేసినట్లు ఆ వీడియోలో ఆయన చెప్పాడు. పంజాబ్ పోలీసులు తనపై ఐపీసీ 376 కింద కేసు బుక్ చేశారన్నారు. తన మాజీ భార్య ఆ కేసులో ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ బృందం తనపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు.
Also Read..
IndiGo | విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Railway employees | రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్.. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా
PM Modi: మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ