Railway employees | రైల్వే ఉద్యోగులకు (Railway employees) భారతీయ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భారీ మొత్తంలో బీమా రక్షణ (accidental death cover) కల్పించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.
రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ (SBI salary accounts) ఉన్న ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా కవరేజీని పొందనున్నారు. అంతేకాదు ఎస్బీఐ శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు రూ. 10 లక్షల సహజ మరణ బీమాకు కూడా అర్హులే. ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా రైల్వే ఉద్యోగులకు వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఎస్బీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వారందరికీ ఈ బీమా ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ అవగాహన ఒప్పందం రూ.కోటి ప్రమాద బీమా కవర్తోపాటు పలు బీమా రక్షణలను కూడా అందిస్తుంది. వీటిలో రూ.1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ మొదలైనవి ఉన్నాయి. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతు ఇచ్చేందుకే ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read..
PM Modi: మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
Yamuna River | అంతకంతకూ పెరుగుతున్న యమునా నీటిమట్టం.. ఢీల్లీలో ఇండ్లలోకి చేరిన వరద నీరు
17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ