ఉదయ్‌పూర్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన రేఖ (55) ఓ వైపు తన మనుమలను ఆడిస్తూనే, మరోవైపు 17వ బిడ్డకు జన్మనిచ్చారు. ఝడోల్ బ్లాక్‌లోని ప్రజారోగ్య కేంద్రంలో ఆమె ప్రసవించారు. దీంతో లీలావాస్ గ్రామస్థులు, ఆమె బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెను చూడటానికి దవాఖానకు తరలి వెళ్లారు.
ఆమె మనుమలు ఆమె కొత్త బిడ్డకు స్వాగతం చెప్తుండటంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. రేఖ భర్త కవర రామ్ కల్బెలియా స్క్రాప్ డీలర్. వీరికి జన్మించిన వారిలో ప్రస్తుతం 12 మంది జీవించి ఉన్నారు. తమ పిల్లల్లో ఎవరూ పాఠశాలకు వెళ్లలేదని కవర రామ్ చెప్పారు.