IndiGo | ఇండిగో (IndiGo) విమానాన్ని పక్షి ఢీ కొట్టింది (bird hit on IndiGo). దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 270 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్‌గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇండిగోకు చెందిన 6E812 విమానం మంగళవారం ఉదయం 272 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా బయల్దేరింది (Nagpur-Kolkata flight). అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. తనిఖీల అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Also Read..
Railway employees | రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా
MLA Harmeet Singh: ఎమ్మెల్యే హర్మీత్ సింగ్‌పై రేప్ కేసు.. అరెస్టు
PM Modi: మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ