పాటియాలా: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్మజ్రా(MLA Harmeet Singh )పై రేప్ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ అరెస్టుకు ముందు ఫేస్బుక్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓ పాత ఘటనకు సంబంధించి తనపై రేప్ కేసు నమోదు చేసినట్లు ఆ వీడియోలో ఆయన చెప్పాడు. పంజాబ్ పోలీసులు తనపై ఐపీసీ 376 కింద కేసు బుక్ చేశారన్నారు. తన మాజీ భార్య ఆ కేసులో ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ బృందం తనపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు.
Sanour AAP MLA Harmeet Singh Pathanmajra in a Facebook LIVE said Punjab Police has now booked him under IPC 376 in an old case involving his ex-wife. He alleged the Delhi AAP team is trying to rule over Punjab and is “suppressing his voice.”
#Punjab https://t.co/MMgsh6qeBJ pic.twitter.com/dTeSKyJK1G— Gagandeep Singh (@Gagan4344) September 2, 2025