TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు (Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు పెంచింది (salary increments). ఇందుకు సంబంధించిన ఇంక్రిమెంట్ లెటర్లను తమ ఉద్యోగులకు సోమవారం సాయంత్రం నుంచే టీసీఎస్ పంపించడం మొదలు పెట్టినట్లు ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న వ్యక్తులను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ పెంపు సెప్టెంబర్ నెల నుంచే వర్తిస్తుందని తెలిపినట్లు సదరు వ్యక్తులు వెల్లడించారు. ఉద్యోగి పని తీరు, కేటగిరీని బట్టి 4.5 శాతం నుంచి 7 శాతం వరకూ వేతనాలు పెంచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవలే టీసీఎస్ పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే దాదాపు 80 శాతం ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు (wage hikes) టీసీఎస్ ప్రకటించింది. జూనియర్, మధ్య స్థాయి (సీ3ఏ గ్రేడ్ వరకు) ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు. అందుకు అనుగుణంగానే వేతన పెంపును అమలు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్‌లో 613,069 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read..
Tesla | భారత విపణిలో టెస్లాకు నిరాశే.. ఆశించిన స్థాయిలో లేని బుకింగ్స్..!
Samsung | సామ్సంగ్ పలుచని మరో స్మార్ట్‌ఫోన్.. ప్రారంభ ధర ఎంతంటే?
ఆల్‌టైమ్ హైకి బంగారం ధర.. వెండి రేట్లూ రికార్డు స్థాయికి