హైదరాబాద్, సెప్టెంబర్ 1: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్సంగ్ దేశీయ మార్కెట్లోకి మరో 5జీ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ సీరిస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ఏ17 5జీని ఏఐ ఇన్నోవేషన్‌తో తీర్చిదిద్దింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.18,999. దీంట్లో 6జీబీ+128జీబీ రకం ధర రూ.18,999గాను, 8జీబీ+128 జీబీ రకం రూ.20,499, 8జీబీ+256 జీబీ రకం రూ.23,499కి లభించనున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్యా బాబర్ తెలిపారు.
హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐకి చెందిన కార్డులతో కొనుగోలు చేసిన వారికి రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు సున్న వడ్డీతో జీరో డౌన్‌పేమెంట్,జీరో ప్రాసెసింగ్‌తో 10 నెలల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లింపులతో కొనుగోలు చేయవచ్చును. 7.5 మిల్లీమీటర్ల మందం, 192 గ్రాముల బరువు, వాయిస్ మెయిల్, 50 మెగాపిక్సెల్ నో షేక్ కెమెరా, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ-సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ దేశవ్యాప్తంగావున్న అన్ని రిటైల్ స్టోర్లు, సామ్సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర ఆన్‌లైన్‌లోనూ లభించనున్నది.