Flash Floods | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు (Flash Floods) అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా పాక్ వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి మెరుపు వరదలు సంభవించాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, ఇళ్లను వరద ముంచెత్తింది. భారీ వర్షానికి పలు చోట్ల ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. కుండపోత వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.
بونیر اور سوات کی موجودہ صورتحال ⛈️⛈️😱
Weather Updates PK 2.0 – Jawad Memon / #pakistandoppler pic.twitter.com/9uNNF9wnSc
— Weather Updates PK (@WeatherWupk) August 15, 2025
ఈ కుంభవృష్టి కారణంగా రెండు రోజుల్లోనే దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర పాకిస్థాన్లో భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలకు గత 48 గంటల్లో కనీసం 321 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శనివారం తెలిపారు. అత్యధికంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోనే 307 మంది మరణించినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. వంద మందికిపైగా గాయపడ్డారు. అనేక మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చేపడుతోంది. వరదలకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పాక్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Flash floods and heavy rain swept through northwest Pakistan, killing nearly 200 people as well as five crew members of a rescue helicopter, all within 24 hours https://t.co/NySUVyAq0S pic.twitter.com/7pv2UBwR4y
— Reuters (@Reuters) August 16, 2025
خیبرپختونخوا میں سیلاب سے 150 افراد جاں بحق ہونے کی تصدیق:
◀️بونیر میں 82
◀️باجوڑ میں 21
◀️بٹگرام میں 15
◀️مانسہرہ میں 14
◀️سوات میں 11
◀️لوئر دیر میں 5
◀️شانگلہ میں 2 pic.twitter.com/MpA2v8XSUK— Weather Updates PK (@WeatherWupk) August 15, 2025
⚠️ 🇵🇰 भीषण बाढ़ से #Pakistan में भारी तबाही —
🌊 पिछले 48 घंटों में कम से कम 321 लोगों की मौत (AFP)
🏚️ गाँव तबाह, इमारतें ढहीं, सड़कें व वाहन बह गए
#PakistanFloods #Pakistani #BreakingNews pic.twitter.com/Kk4kCpEwaL— Madhurendra kumar मधुरेन्द्र कुमार (@Madhurendra13) August 16, 2025
Also Read..
Ukraine president | జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్.. సోమవారం వాషింగ్టన్లో భేటీ..!