Trump Putin Meeting | ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భేటీ ముగిసింది. అలస్కా (Alaska) వేదికగా జరిగిన ఈ సమావేశం ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే దిశగా ఉంటుందని అంతా భావించారు. అయితే, ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇద్దరి మధ్య చర్చలు ముగిశాయి. ఇక పుతిన్‌తో భేటీ వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సైనిక సత్తాను ప్రదర్శించారు.
— Dan Scavino (@Scavino47) August 15, 2025
ఈ భేటీకి ముందు అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరానికి తొలుత ట్రంప్ (Donald Trump) చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటి పుతిన్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పుతిన్‌కు ట్రంప్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అయితే, పుతిన్‌ను చిరునవ్వుతో పలకరించిన ట్రంప్.. అదే సందర్భంలో తన ‘పవర్ ప్లే’ చూపించారు. ట్రంప్, పుతిన్ పోడియం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. వారిపైనుంచి బీ-2 బాంబర్లు దూసుకెళ్లాయి. అంతేకాదు, వీరు వెళ్తున్న మార్గంలో యుద్ధ విమానాలను వరుసగా పార్క్ చేసి ఉంచారు. ఇది చూసి పుటిన్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
Trump just flew a B-2 stealth bomber over Putin’s head…
Absolutely incredible. pic.twitter.com/2bsnssRv9f
— Geiger Capital (@Geiger_Capital) August 15, 2025
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు, పలువురు ప్రముఖులు పుతిన్‌కు ట్రంప్ అమెరికా సైనిక సత్తాను పరోక్షంగా చూపించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. కాగా, ఇటీవలే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా టెహ్రాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ఈ బీ-2 బాంబర్లను ఉపయోగించిన విషయం సంగతి తెలిసిందే.
తదుపరి భేటీ మాస్కోలో..
మరోవైపు సమావేశం అనంతరం ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ అన్నారు. భేటీలో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఈయూ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు.
Also Read..
Hillary Clinton | ఆ పని చేస్తే ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తా: హిల్లరీ క్లింటన్
Trump Putin Meeting | ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ..
ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగేనా?.. ట్రంప్-పుతిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి