వాషింగ్టన్: వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించి తన అక్కసును వెళ్లగక్కారు. భారత ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందిస్తుండటంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. సుంకాలపై వివాదం పరిష్కారమయ్యే వరకు భారతదేశంతో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. 50 శాతం టారీఫ్‌ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశించారా అని మీడియా అగిన ప్రశ్నకు ‘లేదు, వివాదం పరిష్కారం అయ్యేవరకు చర్చల ప్రసక్తే లేదంటూ సమాధానమిచ్చారు.
కాగా, భారత్‌పై మరో విడత ట్రారీఫ్లు వడ్డిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారనే సాకుతో 25 శాతం చొప్పున వరుసగా రెండుసార్లు విధించిన టారిఫ్ ఇప్పటికే 50 శాతానికి చేరింది. రష్యా నుంచి చైనా కూడా చమురును కొంటున్నప్పటికీ, కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారని విలేకర్లు ప్రశ్నించినపుడు ట్రంప్ స్పందిస్తూ, “ఇప్పటికి ఎనిమిది గంటలే అయింది. చూద్దాం ఏం జరుగుతుందో” అన్నారు. “మీరు మరిన్ని చూడబోతున్నారు. మీరు తదుపరి ఆంక్షలను చూడబోతున్నారు” అని చెప్పారు.
అయితే ట్రంప్ టారీఫ్‌లపై ప్రధాని మోదీ కూడా ధీటుగా స్పందించారు. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ జయంతి సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘రైతుల ప్రయోజనాలకే మా అగ్ర ప్రాధాన్యత. రైతులు, పాడి రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో భారత్ ఎన్నడూ రాజీపడదు’ అని అన్నారు.
#WATCH | Responding to ANI’s question, ‘Just to follow up India’s tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?’, US President Donald Trump says, “No, not until we get it resolved.”
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd
— ANI (@ANI) August 7, 2025