వెల్లింగ్టన్: సిక్కుల ఊరేగింపును న్యూజిలాండ్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ దేశ యుద్ధ కళ ‘హాకా’ ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రపంచీకరణ, వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఎలాంటి ఘర్షణ జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. (New Zealand Protesters Disrupt Sikh Procession) న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న సిక్కులు శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు.
కాగా, రాజకీయ, మతపరమైన ప్రాముఖ్యత ఉన్న బ్రియాన్ టమాకి నేతృత్వంలోని ‘ట్రూ పేట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్’ గుంపు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. గ్రేట్ సౌత్ రోడ్లో సిక్కుల ఊరేగింపునకు సమాంతరంగా వారు ర్యాలీ నిర్వహించారు. ‘ఇది న్యూజిలాండ్. ఇండియా కాదు’ అంటూ పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆ దేశ యుద్ధ కళ ‘హాకా’ ప్రదర్శనతో ప్రజల దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రపంచీకరణ, సామూహిక వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు న్యూజిలాండ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. రెండు గ్రూపులను దూరంగా ఉంచారు. శాంతి భద్రతల పరిస్థితి దిగజారకుండా నిరోధించారు. దీంతో కొద్దిసేపు నిలిచిపోయిన సిక్కుల ఊరేగింపు ఆ తర్వాత ప్రశాంతంగా కొనసాగింది. న్యూజిలాండ్ నిరసనకారుల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A Sikh Nagar Kirtan organised by Sikh groups was briefly disrupted when a group of youths, known to be associated with Destiny Church led by Brian Tamaki, blocked the route and performed a haka, holding placards stating “This is New Zealand, not India.”
Police stepped in to keep… pic.twitter.com/tLZqKq6k6P
— Gagandeep Singh (@Gagan4344) December 21, 2025
Also Read:
Migrant Worker Lynched | బంగ్లా దేశీయుడిగా అనుమానించి.. వలస కార్మికుడిని కొట్టి చంపారు
School girl Blocks Road | స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డును దిగ్బంధించి విద్యార్థిని నిరసన
Watch: ఆటో డ్రైవర్‌ను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్