New Zealand | న్యూజిలాండ్ ప్రధాని (New Zealand Prime Minister) క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon)కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్ ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రధాని కమర్షియల్ ఫ్లైట్‌లో జపాన్‌కు చేరుకున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం తెలిపింది.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లక్సన్ జపాన్ (Japan)కు బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన బోయింగ్ 757 విమానం ఇంధనం నింపుకునేందుకు పాపువా న్యూగినియాలో ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో సమస్య తలెత్తింది. బ్రేక్ డౌన్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని లక్సన్ సహా అధికారుల బృందం అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్‌లో జపాన్‌కు వెళ్లినట్లు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
Also Read..
Vignesh Shivan | తన ఇద్దరు పిల్లలతో.. బాహుబలి సీన్‌ను రీక్రియేట్ చేసిన విఘ్నేశ్ శివన్