Benjamin Netanyahu | అగ్రరాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly)లో ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు (UN Delegates Walk Out). చాలా వరకూ కుర్చీలు ఖాళీ అయ్యాయి (Empty Chairs). ఇక నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాలులో అర్ధం కాని అరుపులు ప్రతిధ్వనించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదే లేదని, తన వైఖరిలో మార్పు రాదని తేల్చి చెప్పారు. హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.
❗Netanyahu visibly SHAKEN as majority of UN delegates STORM out of General Assembly hall — ‘Please ORDER in the hall’ https://t.co/JGrjGIN8bR pic.twitter.com/7c4IVf8Lnx
— RT (@RT_com) September 26, 2025
Also Read..
Epstein Files | ఎప్స్టీన్ ఫైళ్లలో ఎలాన్ మస్క్ పేరు.. ఖండించిన ప్రపంచ కుబేరుడు
Black Holes | ఏటా 3,000 సూర్యుళ్లను మింగేస్తున్న కృష్ణబిలం!
Cow Brain | పాల దిగుబడికి ఆవు మెదడులో ఇంప్లాంట్.. రష్యాలో సంచలన ప్రయోగం