Pakistan Elections | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం (Election Commission of Pakistan) తాజాగా వెల్లడించింది. ఈ ఫలితాల్లో నవాజ్ షరీఫ్ పార్టీ (Nawaz Sharifs Party) పాకిస్థాన్ ముస్లిం లీగ్ 17 స్థానాల్లో గెలుపొందింది. ఇక జైలుశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఏకంగా 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నట్లు పాక్ ఎన్నికల సంఘం వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాగా, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈ సారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 135 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.
Also Read..
Richa Chadha | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిచా చద్దా – అలీ ఫజల్ జంట
Amitabh Bachchan | అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న అమితాబ్ బచ్చన్
Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్కు మెటా షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలు తొలగింపు