Amitabh Bachchan | అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలోని రామ మందిరాన్ని (Ram Temple) మరోసారి సందర్శించారు.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలోని రామ మందిరాన్ని (Ram Temple) మరోసారి సందర్శించారు. శుక్రవారం ముంబై నుంచి అయోధ్య (Ayodhya)కు వెళ్లిన బిగ్‌బీ.. బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ భద్రత మధ్య బిగ్‌బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
VIDEO | Actor Amitabh Bachchan (@SrBachchan) visits Ayodhya’s Ram Mandir to offer prayers.
(Source: Third Party) pic.twitter.com/Q3V3uI6m7k
— Press Trust of India (@PTI_News) February 9, 2024
కాగా, అమితాబ్ బచ్చన్ నెల రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండో సారి. గత నెల 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు బిగ్‌బీతోపాటు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు. అప్పుడు రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను కూడా బిగ్‌బీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రామచంద్రకీ జై’ (Ramchandra Ki Jai) అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.
Also Read..
Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్‌కు మెటా షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు తొలగింపు
Vishwak Sen | గామి షూట్ టైంలో ఫలక్‌నుమా దాస్ టీజర్ ఎడిట్ చేస్తున్నా: విశ్వక్సేన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

