Flight Attendant | విమానం టాయిలెట్లో సీక్రెట్‌గా రికార్డింగ్.. ఫ్లైట్ అటెండెంట్ అరెస్ట్
Flight Attendant | మైనర్ బాలికలు టాయిలెట్ (Plane Toilet)లో ఉండగా రహస్యంగా రికార్డు చేస్తున్న ఫ్లైట్ సిబ్బంది ఒకరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Flight Attendant | మైనర్ బాలికలు టాయిలెట్ (Plane Toilet)లో ఉండగా రహస్యంగా రికార్డు చేస్తున్న ఫ్లైట్ సిబ్బంది ఒకరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థపైనా కేసు బుక్ చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గతేడాది ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం.. గతేడాదని సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్ నార్త్ కరోలినాలోని షార్లెట్ నుండి బోస్టన్‌కు వెళ్తోంది. విమానంలో అటెండెంట్ (Flight Attendant)గా పనిచేస్తున్న ఎస్టెస్ కార్టర్ థామ్సన్ (Estes Carter Thompson) అనే 34 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికలు బాత్రూమ్లో ఉండగా రహస్యంగా తన ఫోన్లో రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు (Filming Minors). 14 ఏళ్ల మైనర్ బాలిక టాయిలెట్‌కి అని వెళ్లింది. అయితే, పక్కనే ఉన్న బాత్రూమ్ బాలేదని చెప్పి.. ఫస్ట్ క్లాస్ సెక్షన్‌లోని బాత్రూమ్కు పంపించాడు. అందులో ముందుగానే తన సెల్‌ఫోన్‌ను టేపుతో గోడకు అంటించి పెట్టాడు. బాత్రూమ్లోకి వెళ్లిన బాలిక అక్కడ సెల్‌ఫోన్‌ను గుర్తించి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత కుటుంబం ఈ ఘటనపై సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలిక సహా నలుగురు మైనర్లను నిందితుడు టార్గెట్ చేసుకున్నట్టు గుర్తించారు. గతేడాది జనవరి- ఆగస్టు మధ్య కాలంలో నిందితుడు.. 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు చిన్నారులను సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు వెల్లడైంది. అతడి ఐక్లౌడ్ అకౌంట్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. లైంగిక వేధింపులకు యత్నించడం, చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల కింద పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 18వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థపైన కూడా కేసు బుక్ చేశారు.
Also Read..
Vishwak Sen | గామి షూట్ టైంలో ఫలక్‌నుమా దాస్ టీజర్ ఎడిట్ చేస్తున్నా: విశ్వక్సేన్
BRS MLCs | మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Haldwani violence: ఆక్రమణ ప్రాంతాల్లోనే డెమోలిషన్ డ్రైవ్: జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

